జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి అని తాండా బాలకృష్ణ గౌడ్ అన్నారు,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించు కొని గ్రామస్తుల ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్, మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్, అఖండ భారత సామ్రాజ్యమే లక్ష్యంగా మొగల్ చక్రవర్తులను ఎదిరించి పోరాడిన యోధుడు చత్రపతి శివాజీ, శౌర్యానికి ప్రతిరూపమని చత్రపతి శివాజీ, అడుగుజాడల్లో యువత పయనించాలని అన్నారు ,ఈ కార్యక్రమంలో రాజు, ప్రవీణ్ బాలకృష్ణ ,మల్లేష్ అనిల్ ,అరుణ్ ,భాస్కర్ ,భానుగ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.