జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వాహన షోరూం యజమానులు తప్పనిసరిగా ఫిబ్రవరి నెల చివరి నాటికి రెన్యూవల్ చేయించుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డి. మణికుమార్ అన్నారు. RTO కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహన షోరూంల యజమానులతో సమావేశం నిర్వహించారు. టి.ఆర్. లేకుండా యజమానికి వాహనాన్ని ఇవ్వరాదన్నారు. జిల్లాలోని అన్ని డీలర్స్, సబ్ డీలర్స్ అందరూ ఖచ్చితంగా ఫార్మ్-1 6లో వాహన్ పోర్టల్లో సమర్పించాలన్నారు.