బిచ్కుంద ఫిబ్రవరి 20 జనం న్యూస్ ( జుక్కల్ కానిస్టేసన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని బిచ్కుంద పట్టణంలోని శివాజీ చౌక్ లో శివాజీ మహారాజ్ జయంతి అంగరంగ వైభవంగా శ్రీ సద్గురు బండయప్ప పీఠాధికారి శ్రీ శ్రీ హోమలింగ శివాచార్య మహారాజ్ శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సద్గురు సోమలింగ శివాచార్య మహా స్వామిజి మాట్లాడుతూ శక్తి, సాంస్కృతి, స్వతంత్రం పోరాటం అనే మూడు విలువలతో భారతీయతను నిలబెట్టిన చత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా బిచ్కుంద మండలంలో అంగరంగ వైభవంగా పూలమాలతో పూలాభిషేకం చేయడం జరిగింది, హిందూ ధర్మం కోసం సాంస్కృతి సాంప్రదాయాల కోసం యువత ముందుండాలని ఎక్కడ హిందువులకు హిందూ మతానికి భంగం కలిగించిన కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు హిందూ సమాజం కోసం హిందూ సామ్రాట్ అయినటువంటి చత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లికార్జున అప్ప సెట్ కార్,శెట్పల్లి విష్ణు,శివాజి పటేల్, బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాహిల్ రమేష్ సెట్ కార్, నౌషా నాయక్ ,సిఐటియు సురేష్ , చేతన్, పిట్ల సాయిలు, బస్వరాజ్ పటేల్, సాయిరాం, శ్రీకాంత్,సన్నీ, గోపాల్ చారి, డాక్టర్ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు