బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S.రా
జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా తేది 19-02-2025 బుధువారం సిందనూరు డి 12 దెగ్గర బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు వారి బృందం అక్కడకు వెళ్లి ఆందోళన చేసి అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం అర్ డి యస్ కు నీళ్లు ఇవ్వడం లో పూర్తిగా విఫలం ఐనది అని గతం లో ఏప్రిల్ వరకు నీళ్లు వచ్చేవి అని కాని ఇపుడు చుస్తే తుమిళ్ళ లిఫ్ట్ డి23 దెగ్గర ఇప్పటికే 3 పర్యయాలు బంద్ ఐనవి ఇప్పుడు డి 12 దెగ్గర గత 10 రోజుల నుండి నీళ్లు రావడం లేదు రైతులు వరి, మొక్కజొన్న, మెరుప పంటలు వేశారు మరో 3 రోజులు నీళ్లు రాకుంటే పూర్తిగా ఎండిపోతాయి అని వేంటనే నీళ్లు విడిపించాలి అని అన్నారు పైన ఉన్న కర్ణాటక, కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మాత్రం నీళ్లు వస్తున్నాయి కాని మధ్యలో ఉన్న తెలంగాణా రైతులుకు మాత్రం నీళ్లు రావడం లేదు అన్నారు ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే చిన్నోన్నిపల్లి రిజర్వుయిర్ లింక్ ద్వారా డి 12 సిందనూర్ దెగ్గర కలపాలి, మరియు మల్లమ్మకుంట రిజర్వుయిర్ వెంటనే పూర్తిచేయాలి అని అన్నారు ఈకార్యక్రమం లో బీజేపీ అలంపూర్ యం ఎల్ ఏ అభ్యర్థి రాజ్ గోపాల్, మండలం పట్టణం అధ్యక్షులు గోపాలకృష్ణ ,భగత్ రెడ్డి , నర్సిములు ,లక్ష్మణ్ గౌడ్ అశోక్ , బూత్ అధ్యక్షులు గోపాల్, రాజశేఖర్ రైతులు పాలుగోన్నారు.