సబ్ టైటిల్.. జనం న్యూస్ ఫిబ్రవరి 20, జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల కేంద్రంలోని తుంగూర్ గ్రామంలో బుధవారం నాడు చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించుకొని తుంగూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అర్చకులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు శ్రీ కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఓగుల అజయ్ మహారాజ్ శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. మధు కూమార్ చార్యులు శ్రీ కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఓగుల అజయ్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్, అఖండ భారత సామ్రాజ్యమే లక్ష్యంగా మొగల్ చక్రవర్తులను ఎదిరించి పోరాడిన యోధుడు చత్రపతి శివాజీ, శౌర్యానికి ప్రతిరూపమని చత్రపతి శివాజీ, అడుగుజాడల్లో యువత పయనించాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో బి జే పి మండల అధ్యక్షులు ఆడపు నర్సయ్య. విశ్వహిందూ పరిషత్ భజరంగ్ ధళ్ మండల అధ్యాక్షులు. బండారి రవి కూమార్ కంధి భీమన్న ఘర్షకుర్తి రమేష్ శ్రీ కృష్ణ ఫౌండేషన్ సభ్యులు విశ్వహిందూ పరిషత్ భజరంగ్ ధళ్ సభ్యులు మండల పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.