జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు (STU )చిలకలూరిపేట పట్టణ శాఖ ఈరోజు నూతనంగా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి 1గా నియమితులైన నంతవరం శ్రీనివాస రావు ని కలిసి ఎస్టీయూ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టియు పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్ జిల్లా కార్యదర్శి వినుకొండ క్కయ్య పట్టణ నాయకులు ఇనకొల్లు అంకమ్మరావు పి సాగర్ బాబు కె ఏడుకొండలు ఎస్టియు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున చిలకలూరిపేట పట్టణ మరియు మండల పరిధిలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయు ల సంక్షేమం కొరకు మరియు పాఠశాల పరిరక్షణ కొరకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది.