జనం న్యూస్ ఫిబ్రవరి 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈ నెల 24 నుండి జరుగు శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు ఎన్నికలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 4న రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ & మోటార్ కార్మికులు నిరసన ధర్నాలు చేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ రేషసన్(ఏఐటీయూసీ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక చోడవరం బస్ స్టాప్ వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు చేస్తామని, చదువుతున్న డ్రైవర్ల పిల్లలకు స్కాలర్ షిప్ మంజూరు చేస్తామని డ్రైవర్లకు ప్రమాద మరియు వ్యక్తిగతచంద్రన్న బీమా పాలసీ 5 లక్షలునుంచి 10లక్షల రూపాయలు అమలు చేస్తామని టాటా మ్యాజిక్ వ్యానులు కార్లు జీపులకు రోడ్ టాక్స్ గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చి ఎనిమిది నెలలు గడిచిన ఒక్క హామీ కూడా ఈరోజు వరకు అమలు చేయలేదన్నారు.సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ కు ప్రభుత్వం వాహన మిత్ర 15 వేల రూపాయలు ఇచ్చిఆడుకోవాలని , జీవో నెంబర్ 21, 31 ను తక్షణమే రద్దు చేయాలనీ, అనకాపల్లి లో ఆటోలుకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు అలాగే ఆటో ఎఫ్ సి లు ప్రైవేట్ వ్యక్తలు కు యిచ్చే ఆలోచన విరమించాలని డిమాండ్ చేశారు లేని పక్షం లో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమం లో సంఘం నాయకులు పెదిరెడ్లు నాగేశ్వారరావు, కరణం చిరంజీవి, మడిశ శ్రీను, మల్లి బాబు, తాతారావు, డొంక సింహ చలం నాయుడు, పెంటరావు, కృష్ణ, అక్కయ్య తదితరులు పాల్గొన్నారు.//