జనం న్యూస్- ఫిబ్రవరి 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ హీరే కార్ రమేష్ జి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయ పరిధిలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా రమేష్ జి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ చిన్నతనం నుంచి విద్యా రాజనీతి అభ్యసించారని 16 సంవత్సరాల వయసులోనే శరణు కోటను స్వాధీనం చేసుకోవడంతో ఆయన వీర గాధ ప్రారంభమైందని గెరిల్లా యుద్ధ తంత్రాలతో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని విజయం సాధించాలని హిందూ స్వరాజ్య స్థాపన కోసం పాటుపడ్డ శివాజీ ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చత్రపతి శివాజీ మహారాజ్ భారత దేశ చరిత్రలో 1630 ఫిబ్రవరి 19న శివునేరి కోటలో జన్మించాలని ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారని తల్లి జిజియాబాద్ నుంచి నీతి ధర్మం దేశభక్తి వంటి విలువలను నేర్చుకున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాయకులు ఈశ్వర్ జి, రవి, రామరాజు, బి లక్ష్మణ్,, బి మహేష్, కే జయరాం, డి నరసింహారావు, హెచ్ సందీప్, అశోక్ జి, మహిళా నాయకులు జిన్నాభాయ్, లలిత భాయ్, అరుణ బ్బయి, నిర్మల, శారద, సునీత, అంబిక, అరుణ, దీపిక, శ్రీజ, శిరీష, రామ్ భాయ్, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.