జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు పట్టణంలో పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవలు పునరుద్ధరించబడినవి అని స్థానిక సబ్ పోస్ట్ మాస్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యంగా కొత్తవి,ఆధార్ సవరణలు, చిన్నపిల్లలవి ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలు వారి యొక్క ఫోటో మరియు స్వతహాగా వేలిముద్రలు నమోదు కొరకు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం, పది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలు మరియు మగ బిడ్డల కొరకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలలో చేరడానికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరం ఆసరా పింఛన్ లబ్ధిదారులకు వేలిముద్ర రాణి వారు ఆధార్ పునరుద్ధరణ చేసి పోస్ట్ ఆఫీస్ లో సేవలు వినియోగించుకోవాలని తెలిపారు