కిలోమీటర్ల మేర వ్యాపించిన మంటలు భయాందోళనలో స్థానిక తండావాసులు
జనం న్యూస్- ఫిబ్రవరి 20: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం సమీపంలోని అడవిలో భారీగా చెలరేగిన మంటలు కిలోమీటర్ల మేర అడవి దగ్ధం చింతలపాలెం రోడ్డు నుంచి పైలాన్ కాలనీ వరకు ఉన్న అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు, గాలి వాటం ఎక్కువగా ఉండటంతో 20 ఎకరాల్లో సగానికి పైగా అటవీ ప్రాంతం దగ్ధమైందని స్థానికులు తెలిపారు, బుధవారం సాయం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంటలు వ్యాప్తి చెందుతానే ఉన్నాయని, రాత్రంతా అడవిలోనే ఉండి మంటలను అదుపులోకి తెచ్చిన ఫారెస్ట్ అధికారులు, బేస్ క్యాంప్ వాచర్ల సహాయంతో అటవీ అధికారులు అడవిలోని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు, మంటలు అదుపులోకి రావడంతో భయాందోళనలు వదిలి ఊపిరి పీల్చుకున్న సమీప గ్రామస్తులు తండావాసులు.