విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 20 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను చెల్లించే విధంగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 19న ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పోలీసు స్టేషను పరిధిలో వాహన తనిఖీలు చేపట్టి, ఆయా వాహనాలపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను వాహనదారులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి, వాహన తనిఖీల్లో వాహనాల రికార్డులను పరిశీలించి, ఆయా వాహనాలపై ఏమైనా పెండింగు ఈ చలానాలు ఉన్నవి, లేనిది చెక్ చేయాలన్నారు. ఆయా వాహనాలపై ఏమైనా ఈచలానాలు పెండింగులో ఉన్నట్లయితే, వాటిని వాహనదారులు చెల్లించేంత వరకు ఆయా వాహనాలను సీజ్ చేయాలన్నారు. ఎం.వి.నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఈ-చలానాలను విధిస్తున్నప్పటికీ
వాహనదారులు వాటిని చెల్లించుటలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. వాహనదారుల నిర్లక్ష్యంతో ఆయా వాహనాలపై ఈ-చలానాలు పెండింగులో ఉండిపోతున్నాయన్నారు. కావున, పోలీసు అధికారులు ఈ తరహా వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగు ఈ చలానాలను వాహనదారులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగులో ఉన్న ఈ-చలానాలను చెల్లించేంత వరకు వాహనాలను కూడా సీజ్ చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వాహన తనిఖీలు చేపట్టే సమయాల్లో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అదే విధంగా ఎం.వి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఈ చలానాలను క్రొత్తగా విధించాలని, పెండింగులో ఉన్న చలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.