జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర హోం మంత్రి, పదకొండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన ఇంద్రజిత్తు గుప్తా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. కమ్యునిస్టు పార్టీ యోధుడు, మాజీ కేంద్ర ఇంద్రజిత్ గుప్తా 24వ వర్దంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఇంద్రజిత్ గుప్తా చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. పీడిత, తాడిత ప్రజల కోసం, పార్లమెంటులో నైతిక విలువల కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని వివరించారు. జైలు జీవితం గడిపిన ఆయన కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ బందేలా రవి కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అంజయ్య,