జనం న్యూస్ ఫిబ్రవరి 20 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఇటీవల నియోజవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎండి సలీం బాల నగర్ లోని పార్టీ కార్యాలయంలో గురువారం బండి రమేష్ ని కలిసి పార్టీ ధ్రువపత్రాన్ని పొందారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పార్టీ పదవులు ప్రజాసేవకే వినియోగించాలని అధికార దర్పానికి కాదని సూచించారు.సలీం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో యుగేందర్, మధు గౌడ్ ,అస్లాం, కిట్టు, భరత్ ,నరేందర్, రంగస్వామి, ప్రణతి ,బాలరాజ్, పర్వేజ్ ,వెంకటేష్ ,తోమస్ తదితరులు పాల్గొన్నారు.