సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వర్ రావు..
జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి ఫిబ్రవరి 20 (ప్రజా జ్యోతి) నూతనంగా హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె మహేందర్ ను సన్మానించిన సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు మరియు ఇతర నాయకులు ఈ సందర్భంగా సింగిల్ విండో మాజీ చైర్మన్ మాట్లాడుతూ.ఎస్సీ సెల్ హనుమకొండ జిల్లా చైర్మన్ గొర్రె మహేందర్ చిన్న వయసులోనే అధికారం లేని సమయంలో పార్టీ కష్ట కాలంలో అధినాయకత్వము ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తన సొంత డబ్బులతో కార్యక్రమాలు చేయడంలో ముందుండేవాడని అన్నారు అధికారం వచ్చిన తర్వాత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి పదవి బాధ్యతలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇతర పార్టీలో లేదని అందుకు నిదర్శనం ఎస్సీ సెల్ హనుమకొండ జిల్లా చైర్మన్ గొర్రె మహేందర్ నిదర్శమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంకూరి యాదగిరి, మాటూరు సారయ్య, యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు అంబాల యువరాజ్, కడారి సురేందర్, కడారి అశోక్, కడారి కిరణ్, బిఆర్ఎస్ నాయకులు అంబాల కార్తీక్, తదితరులు పాల్గొన్నారు,