జనం న్యూస్;20 ఫిబ్రవరి గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి ; ప్రతి ఒక్కరూ శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జాతీయ సాహిత్య పరిషత్ కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, కోణం పరశురాములు, నల్ల అశోక్, చీకోటి రాములు అన్నారు. 19 ఫిబ్రవరి బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాగదేవత చౌరస్తా వద్ద గల శివాజీ విగ్రహానికి పూలమాల వేసి వారు మాట్లాడుతూ తల్లివద్ద నేర్చిన ధర్మాన్ని మరణం వరకు పాటించిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు.