జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. లక్ష్మీనరసింహస్వామికాసుల గుట్టకు శాశ్విత రహదారిఏర్పాటు చేయాలిఅలసత్వం వహించకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలి స్థానిక ప్రజల విజ్ఞప్తి నందలూరు: ఫిబ్రవరి 20:- మండలంలోని పాటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రి పాపయ్య గారి పల్లె గ్రామ సమీపంలో దిన దినాభివృద్ధి చెందుతున్న కాసుల గుట్టపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి శాశ్విత రహదారి ఏర్పాటు చేయాలని, పాటూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలే కాకుండా ఆలయాన్ని దర్శించుకుంటున్న మండల వ్యాప్తంగా పలువురు భక్తులు కోరుకుంటున్నారు. కాసులు గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయముతో పాటు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదముద్రిక గుట్టపై వెలసినట్లు స్థానిక ప్రజల నమ్మకం మండల వ్యాప్తంగా ప్రజలే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు వస్తుంటారని, నందలూరు బస్టాండు నుండి పాటూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి లోని ఎర్రి పాపయ్య గారి పల్లె సమీపంలో వెటర్నరీ హాస్పిటల్ నుండి కాసుల గుట్టకు శాశ్వత రోడ్డు నిర్మాణానికి అక్కడ ఉన్న 40 సెంట్లు పైగా ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే రోడ్డు వేసేందుకు అనుకూలంగా ఉంటుందని స్థానిక ప్రజలు అంటున్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలలో సైతం రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడంలో అలసత్వం వహించకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపడితే రోడ్డు నిర్మాణం జరిగితే ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన వారు అవుతారని, రోడ్డు సరిగా లేకపోవడం వల్ల వర్షాకాలంలో నీటితో బుడదమయి మై భక్తులు, స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి రోడ్డు వేసేందుకు కృషి చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.