జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బుధవారం నిర్వహించిన బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి హిందువుకి మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ కు ధన్యవాదాలు తెలుపు తున్నట్లు బిజెపి రాష్ట్ర నాయకులు పోతురాజు మస్తానయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం మరాఠా యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ చత్రపతి శివాజీ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా మారమ్మ దేవాలయం నుండి బస్టాండు కూడలి వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పార్టీలకు అతీతంగా హిందువులు ర్యాలీలో పాల్గొని దేశభక్తిని, ఐక్యతను చాటుకున్నారని అన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్ , జనసేన పార్లమెంటరీ పరిశీలకుడు యల్లటూరు శ్రీనివాసరాజు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుకుంట రమేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు వెల్లటూరు శివరామరాజు మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ నందలూరు సర్పంచ్ మోడపోతుల రాము, వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాదాలుతెలియజేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి మండల అధ్యక్షుడు మధు, బిజెపి నాయకులు హిమగిరినాధ్ యాదవ్, బాలాంజనేయులు, జయ కుమార్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు చుక్క శ్రీనివాసులు, మాజీ బిజెపి మండల అధ్యక్షుడు ఆండ్ర శివారెడ్డి, మోడపోతుల రాము, గురువి గారి వాసు, గంధం గంగాధర్, ఆనాల మధు, తదితరులు పాల్గొన్నారు.