జనం న్యూస్ 11.1.2025
మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు
మెదక్ జిల్లా చేగుంటలో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని నిర్వహించడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు, పట్ల విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని, వారు భవిష్యత్తులో అనుసరించడానికి అవకాశం ఉంటుందని, రంగవల్లుల పోటీల వల్ల, విద్యార్థుల సృజనాత్మకత ప్రదర్శించడానికి చక్కటి అవకాశం గా ఉంటుదని అన్నారు. రంగవల్లులు, గాలిపటాలలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం రఘుపతి, ఉపాధ్యాయులు రాజేశ్వర్, సుధాకర్ రెడ్డి, సురేందర్, లక్ష్మణ్, వెంకటేష్, మనోహర్, రాధా, సరస్వతి, రమా, రమాదేవి, శారద, శ్రీ వాణి ఉమామహేశ్వరి, రేఖ, శృతి, సత్తయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు