విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 21: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలన్సర్స్ ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలన్సర్స్ ను, తొలగించడం, మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 20న హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలన్సర్స్ ను తొలగించి, వాటిని మళ్ళీ వాహనదారులు వినియోగించకుండా వాటిని రోడ్డు రోలర్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - ద్విచక్ర వాహనాలను సంబంధిక వాహన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి, సైలన్సర్స్ ను అమరుస్తారని, వీటిని మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాలకు సైలన్సర్స్ మార్పులు చేస్తూ, పెద్ద శబ్ధాలతో ఇతర వాహనదారులను, ప్రజలు, పాదచారులను, పిల్లలు, హృద్రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వీటిని నియంత్రించుటలో భాగంగా గత ఆరు మాసాల్లో ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో పలుమార్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఇండోర్, పంజాబ్, రాకెట్ పేర్లుతో అమర్చిన 250 సైలన్సర్స్ ను మెకానిక్ సహకారంతో తొలగించామన్నారు. అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా సైలన్సర్స్ ను అమర్చినందుకుగాను ఒక్కొక్కరికి రూ.1000/- చొప్పున రూ.2,50,000/- లను జరిమానా విధించామన్నారు. తొలగించిన సైలన్సర్స్ ను మళ్ళీ వాహనదారులు వినియోగించకుండా ఉండేందుకుగాను వీటిని రహదారిపై వేసి, రోడ్డు రోలర్ తో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. భవిష్యత్తులో ఇదే తరహా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సర్లను తొలగిస్తామన్నారు. అంతేకాకుండా, కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం ఈ తరహా సైలన్సర్స్ ను అమర్చిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు, ఆయా వాహనదారులకు రూ.10వేలు జరిమాన విధిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ప్రతీ వాహనదారులు రహదారి భద్రతను పాటించాలని, వాహనాలను అతివేగంగా నడవకూడదని, హెల్మెట్స్ ధరించాలని, ట్రిపుల్ రైడింగు చేయకూడదని, మన భద్రతతోపాటు ఇతరుల భద్రతకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ట్రాన్స్పోర్టు కమీషనరు డి.మణికుమార్, ట్రాఫిక్ సిఐ సూరినాయుడు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే. చౌదరి, 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్, 2వ పట్టణ సిఐ శ్రీనివాసరావు, ఎం.వి.ఐ. మురళీకృష్ణ, ఎస్సైలు శంభాన రవి, ఎస్.భాస్కరరావు, నూకరాజు, అప్పారావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.