రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
జనం న్యూస్ 21 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ఈరోజు ఉదయం 11 గంటలకి భద్రాద్రికొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అనేక పథకాలను ఆశ చూపి గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రజల బాగోగులను మరిచి తమ స్వలాభాల కోసమే పనిచేస్తుందని ఎద్దేవా చేశారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల దోపిడీ జరుగుచున్నదని మా పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోరాటం చేశారని జల వనరులను తెలంగాణకు రావలసిన వాటాను తీసుకొచ్చారని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ దోపిడి చేస్తున్న ప్రశ్నించే ధైర్యం లేని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి తన ప్రాంతానికి రావలసిన జలాలను వాడుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల సాగర్ పరివాహక ప్రాంత రైతులకు తీరని నష్టం జరుగుచున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతున్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈరోజు రాష్ట్రంలో స్వయంగా ముఖ్యమంత్రి మా మంత్రులే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పరిపాలన మీద పట్టు కోల్పోయారని, ఈ విధమైన మాటలు మాట్లాడితే ఐఏఎస్ ఐపీఎస్ లు ముఖ్యమంత్రి మాటను ఖాదర్ చేయలేని పరిస్థితి ఉన్నదని తద్వారా పరిపాలన గాలికి వదిలేసారని పేర్కొన్నారు. ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రాంత రైతుల కోసం శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి లేఖ రాసి ఉద్యమ పోరాట భాట పట్టాడు తెలంగాణ పేగు బంధమైన పార్టీ టిఆర్ఎస్ అని తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆనాడు నియోజకవర్గస్థాయిలో ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, రుణమాఫీ పథకాలను ఏర్పాటు చేసి రైతు బాంధవుడుగా నిలిచారని పేర్కొంటూ అధికారంలో లేమని మా నాయకుడు కేటీఆర్ ని ఈడీ అధికారులను ఉసిగొల్పి వెనువెంటనే కేసులు బుక్ చేపించారు అదే ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి నోట్ల కట్టల మెషిన్లను సైతం ప్రెస్ మిత్రుల సమక్షంలో వీడియోలు చిత్రీకరించిన ఇప్పటివరకు ఆ మంత్రి మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు ఇది ఏ విధమైన పక్షపాతంగా వహిస్తుందో ఆలోచించండి ప్రజలారా అని పేర్కొన్నారు ఈ సమావేశంలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ అనుదీప్ కొట్టి వెంకటేశ్వర్లు భూపతి శ్రీనివాసరావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు