జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తాత్కాలిక ప్రయోజనాలు.. భావోద్వేగాలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి మాజీమంత్రి ప్రత్తిపాటి. విద్యార్థి దశనుంచే ప్రతిఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, జాతీయ.. అంతర్జాతీయ పరిస్థితులపై పట్టు పెంచుకోవాలని, అప్పుడే యువతకు తమచుట్టూ ఉండే సమాజం.. తమ రాష్ట్ర పరిస్థితులపై అవగాహన ఉంటుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలో పలు విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో పట్టభద్రులు, ఉపాధ్యాయులతో వరుస సమావేశాలు నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాతే అసలైన జీవితం ఆరంభమవుతుందనే వాస్తవాన్ని యువత గ్రహించాలన్నారు. చదివిన చదువకు తగిన ఉద్యోగం దొరక్కపోతే, తాము బాధపడటమే గాక, కుటుంబం కూడా వేదన అనుభవిస్తుందనే నిజాన్ని యువత గుర్తించాలన్నారు. యువత జీవితాలు బాగుండాలంటే, రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు.. పేరుపొందిన కంపెనీలు, సంస్థలు తరలిరావాలన్నారు. అప్పుడే రాష్ట్రంలోని యువతకు ఉపాధి లభిస్తుందని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెంది, ప్రజలకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఆ విధంగా భవిష్యత్ ను ముందే ఆలోచించే నేర్పు, దూరదృష్టి కలిగిన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే మనం అనుకున్నవి సాధ్యమవుతాయన్నారు. అలాంటి నాయకుడు కూటమిప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతూ, చిన్నారులు మొదలు అన్నివర్గాల వారి సంతోషం కోసం విరామం లేకుండా పనిచేస్తున్నాడని పుల్లారావు పేర్కొన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు, భావోద్వేగాలకు అతీతంగా యువత రాష్ట్రశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిఅభ్యర్థిని గెలిపించాలని ప్రత్తిపాటి కోరారు. పట్టణంలోని ప్రసన్న లక్ష్మి విధ్యాలయం, బి.ఆర్.ఐ.జి పాఠశాల, నిఖిల, రోహిణి డిగ్రీ కళాశాలలు, మోడ్రన్ కళాశాల, ఏ.ఎంజీ విద్యా సంస్థల్లోని వారిని కలిసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతు తెలపాలని పుల్లారావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, మద్దుమాల రవి, నరసింహారావు మాస్టర్, ఇనగంటి జగదీష్, బీజేపీ, టీడీపీ నాయకులు తదితులున్నారు.