జనం న్యూస్ ఫిబ్రవరి 22 శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లాలో జరిగిన రాజలింగమూర్తి హత్యతో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండలంలోని మైలారం మాజీ పిఎసిఎస్ మాజీ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్ అన్నారు రాజలింగమూర్తి హత్య కు రాజకీయ రంగు రుద్దడం సరికాదన్నారు గండ్ర వెంకటరమణారెడ్డి కి ప్రజల్లో ఆదరణను చూసి ఓర్వలేక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు హత్య రాజకీయాలు కాంగ్రెస్ కే అలవాటు అన్నారు భూవివాదమే హత్యకు కారణమని ప్రజలు పోలీసులు చెప్తున్నప్పటికీ కావాలనే గండ్ర వెంకటరమణారెడ్డి పై అరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు సీటింగ్ జడ్జి తో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు…..