జనం న్యూస్ డిసెంబర్ జనవరి 10 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం
మద్దూర్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భాజపా శ్రేణులు తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. బిజెపి మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా కింద సాగు చేసిన ప్రతి ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు 12 వేల రూపాయలు ఇవ్వడం ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులందరికీ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఎంతోమంది రైతులు రుణమాఫీ కాక వ్యవసాయ కార్యాలయం చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని వారు గుర్తు చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ప్రజలను, రైతులను మోసం చేసిందని బిజెపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆరు గ్యారెంటీల పథకాలను వెంటనే అమలు చేయాలని మద్దూర్. డిప్యూటీ. తాసిల్దార్. కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కే శంకర్. మండల ఉపాఅధ్యక్షులు సుజాత, డికె భరత్, ప్రధాన కార్యదర్శి బర్ల రవికుమార్, శక్తి కేంద్రం ఇంచార్జ్ అండ్ కోశాధికారి రాఘవేంద్ర చారి, బూత్ అధ్యక్షులు సిపిరి హరీష్, ఊషప్ప యాదవ్, మాధవ్, లక్ష్మప్ప కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.