బిచ్కుంద ఫిబ్రవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మహా శివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బిచ్కుంద సద్గురు బండ అయ్యప్ప స్వామి మట సమస్త పీఠాధిపతి సోమలింగ శివా చార్య మహా స్వామీజీ కోరారు బిచ్కుంద క్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు నియోజకవర్గం ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు తరలి రావాలని అన్నారు వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని స్వామీజీ అన్నారు