జనం న్యూస్ ఫిబ్రవరి 22: చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం
జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచేడ్ మండలానికి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు మండల వనరుల కేంద్రంలో బోధనపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది నూతన ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ప్రార్థన సమయానికి పాఠశాలకు వెళ్లాలని,100%విద్యార్థులు హాజరయ్యే విధంగా నూతన ఉపాధ్యాయులు కృషి చేయాలి . విద్యార్థులకు కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా కృషి చేయాలి .
విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉంటూ నైతిక విలువలు పెంపొందించే విధంగా కృషి చేయాలని తెలియజేయడం జరిగింది . ప్రభుత్వవిద్యార్థులకు పాఠశాలలో ప్రాథమిక విద్య బలోపేతం కొరకు నూతన బోధనోపకరణాలను ఉపయోగించి బోధన చేయాలని తెలియజేయడం జరిగింది .విద్యార్థుల తల్లిదండ్రులను సమన్వయం చేసుకొని సరైన విధంగా బోధన చేయాలని తెలియడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విట్టల్ చండూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హరి సింగ్ చిలిపిచేడు కాంప్లెక్స్ ధానోపాధ్యాయులు రమేష్ నూతన ఉపాధ్యాయులు పాల్గొన్నారు