జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లోని పాటూరు పంచాయతీ పరిధి లో గల ఎర్రి పాపయ్య గారి పల్లి దళితులు శుక్రవారం మండల తహసిల్దార్ కు తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వివరాలోనికి వెళ్తే ఎర్రి పాపయ గారి పల్లి నుండి కాసులు గుట్ట క్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉన్న రహదారిని కాదని దళితవాడలోని ఇళ్లను తొలగించి భారీ రహదారి చేయాలని కొంతమంది పలుకుబడి గల వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఎమ్మార్వో వద్ద వెళ్లి అర్జీలు సమర్పించాలని వారు వా పోయారు. గత 20 సంవత్సరాల నుండి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నది తామేనని , ఏ రోజు ఎవరు ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించిన దాఖలాలు లేవని, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉందని అయినప్పటికీ పట్టించుకున్న వారే కరువయ్యారని వారు అన్నారు. ఈ ప్రాంతంలో ఒక కార్పొరేట్ పాఠశాల ఏర్పాటు చేసి దానికి రహదారి కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారని ఆ దళిత వాడ ప్రజలు టున్నారు. ఉత్సవాల సమయంలో మాత్రమే ఈ ఆలయానికి వచ్చే భక్తులు కి ఉన్న రహదారి సరిపోతుందని అలా కాక డీకేటి స్థలంలో పట్టా చేసుకొని నిర్మించిన పాఠశాలకు రహదారి అనేది లేదని ఆ పాఠశాల కోసం కొంతమంది పలుకుబడి కలిగిన నాయకులు కలిసి దళితవాడని ఖాళీ చేసే దిశగా ముందుకు పోవడం ఎంతవరకు సమంజసమని వారు విమర్శిస్తున్నారు. అర్జీని పరిశీలించిన తహసిల్దార్ దీనిపై పూర్తిగా విచారించి తగు న్యాయం చేస్తానని తమకు హామీ ఇచ్చారని అర్జీదారులు ఆన్నారు.