జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ 22: జిల్లా బ్యూరో పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డీ ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు రత్నం ఆనంద్ రావు కొరారు. కొమురంబీం అసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరల విశ్వప్రసాద్ రావు అదెశల మేరకు రెబ్బెన మండల నంబాల గ్రామంలో పట్టభద్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55 వేల ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేసిందని అన్నారు. గ్రూప్స్ పరీక్షలను సమర్ధవంతగా నిర్వహించడం జరిగిందని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి నెల ఒకటో తారీఖు నాడే జీతాలు విడుదల చేయబడుతున్నాయి. కావున ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేద్దామని కార్యకర్తలను కొరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొవ్వూరి శ్రీనివాస్, అడె వేణు, జగన్, ప్రవీణ్, నగేష్, తిరుపతి, సురేష్ పాల్గొన్నారు.