ట్రైనీ ఐపీఎస్ రిత్విక్ సాయి జనం న్యూస్, ఫిబ్రవరి 23, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మధిర సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు కుటుంబ సభ్యులందరూ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రైనీ ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి కోరారు. శనివారం మధిర సీఐ కార్యాలయంలో ఖమ్మం కు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఉచితంగా ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ ఆరోగ్యం విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మధిర సీఐ మధు సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మధు బోనకల్ ఎస్సై మధుబాబు సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.