జనం న్యూస్ 22ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. తల్లాడ : తల్లాడ మండలం, కలకొడిమ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన ఆదూరి రమణయ్య (రఫాయేలు ) కుటుంబానికి బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు హ్యూమన్ రైట్స్ సొసైటీ ద్వారా 50 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ రఫాయేలు గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం అని తను వ్యక్తిత్వంతో, మంచితనంతో గ్రామస్తుల మనసులు చూరగోన్నాడని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. స్థానికంగా సేవచేస్తున్న బిలివర్స్ చర్చి బిషప్. ఆదూరి సాల్మాన్ రాజు మాట్లాడుతూ రఫాయేలు కుటుంబ పరిస్థితులు గమనించి, సహాయం చేసిన హ్యూమన్ రైట్స్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ కో-ఫౌండర్ ఆదూరి మణి,గ్రామంలో సేవ చేస్తున్న కేరళ పాస్టర్. బిన్ను, హ్యూమన్ రైట్స్ సొసైటీ తల్లాడ మండల అధ్యక్షులు ఆదూరి బాబు (మిమిక్రి )తదితరులు పాల్గొన్నారు.