* మార్కెజి ఇంతేజామి కమిటీ మిల్లతే ఇస్లామీయ అధ్యక్ష ఎన్నికల్లో భారి మెజారిటీ తో గెలిపించిన రజియుద్దిన్ అక్తర్ జానీ
జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, జనవరి 11, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణ మర్కజి కమిటీ మిల్లతే ఇస్లామియా అధ్యక్షునిగా భారీ మెజార్టీతో రజియోద్దీన్ అత్తర్ జానీ గెలుపొందారు. ఈ అధ్యక్ష ఎన్నికల కోసం నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా రజియోద్దీన్ అక్తర్ జానీ 583 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు .మెట్పల్లి పట్టణంలోని 16 మసీదులలో ఎన్నికల నిర్వహించారు మొత్తం 1892 ఓట్లు పోల్ అవ్వగా రజియుద్దిన్ అక్తర్ జానీ 1070, షేక్ వకీల్ 487, షేక్ మొహమ్మద్ 487, మహమ్మద్ అమీర్ 56, ఓట్లు వచ్చాయి, 583 ఓట్ల భారీ మెజార్టీతో రజియోద్దీన్ అక్తర్ జానీ గెలుపొందినట్లు ఎలక్షన్ కమిషనర్ అజహర్ అలం ఖాన్ అన్నారు. ఈ పదవి కాలం 2025 నుండి 2027 వరకు కొనసాగుతుందని అన్నారు. అనంతరం రజియోద్దీన్ అక్బర్ జానీ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన మత పెద్దలకు యువతకు ముస్లిం మైనార్టీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముస్లిం మైనార్టీ సమస్యలు పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. అనంతరం గెలుపొందిన అక్తర్ ర్ జానికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు మైనార్టీ సోదరులు యూత్ నాయకులు ఘనంగా సన్మానించారు