జనంన్యూస్. 22 నిజామాబాదు. ప్రతినిధి.ఇందూర్ నగరం. ఉమ్మడి నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల సందర్బంగా మిర్చీకాంపౌండ్ లోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్ల సమావేశానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గంగపురం కిషన్ రెడ్డి.అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. అసెంబ్లీ సభ పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హాజరు కావడం జరిగింది.ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే. మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తరువాతే ఓట్లు అడగాలని అన్నారు, నిరుద్యోగులను మరియు ఉపాధ్యాయులను మోసం చేసి ఏ మొఖం పెట్టుకొని ఈ రోజు ఓట్లు అడగటానికి వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. గ్యారంటీలు, డిక్లరేషన్లు, హామీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఊసరవెల్లిల రంగులు మారుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రాడ్యుయేటర్లు బుద్ది చెప్పడం ఖాయం అన్నారు.రేవంత్ బిజెపికి సవాల్ విసిరేటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు, కేంద్రప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు, కాకతీయ మేఘ టెక్స్ట్ టైల్ పార్క్, రామగుండము ఎరువుల ఫ్యాక్టరీ, సమ్మక్క సరళమ్మ యూనివర్సిటీ, ఇందూర్ జిల్లాకు పసుపు బోర్డుతో పాటు మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్ లో కూడా అన్ని రాష్ట్రాలతో సమానంగా కేంద్రం నిధులు కేటాయించడం జరిగిందన్నారు.రేవంత్ విసిరిన సవాల్ కి బిజెపి నాయకులం సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసారు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అవినీతి చిట్టా కూడా విప్పడానికి సిద్దంగా ఉన్నాం అని అన్నారు. నిరుద్యోగుల పక్షాన, టీచర్ల పక్షాన గోంతేత్తే సత్తా బిజెపికె ఉందని,మేధావులు, విద్యావంతులు, డిగ్రీ పూర్తి చేసిన యువత ఆలోచన చేసి ప్రశ్నించే గొంతుకలైన పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి అంజిరెడ్డిని, టీచర్ ఎమ్మెల్సి అభ్యర్థి మల్క కొమురయ్య కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ. జిల్లా నాయకులు.మండల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.