జనం న్యూస్ ఫిబ్రవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లీ బిజెపి కార్యాలయం నందు, ఏర్పాటుచేసిన కుకట్ పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ మాధవరం కాంతారావు జన్మదిన వేడుకల్లో, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని,వారిని ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తదనంతరం కాంతారావు పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యాలయ ప్రాంగణం నందు నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేసిన దాతలకు రాజేశ్వరరావు సర్టిఫికెట్లు అందించి వారిని అభినందించారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయినేని సూర్యప్రకాష్ రావు, అర్శనపల్లి సూర్యారావు,జిల్ల కో కన్వీనర్ యాంజాల పద్మయ్య, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు సంతోష్ కుమార్ గుప్త కట్ట శంకర్ రెడ్డి నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.