జనం న్యూస్. ఫిబ్రవరి 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మూడవ రోజుకు చేరుకున్న బాహ సే ఇండియా ఈ కార్ రేస్ పోటీలు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథి సి వి రామన్.మారుతీ సుజుకీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బాహా సే ఇండియా ప్రెసిడెంట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని జట్ల విద్యార్థులను పూర్వ విద్యార్థుల కమిటీలను సాంకేతిక బృందలను న్యాయమూర్తులను కలుసుకొని కార్యక్రమ వివరాలను వాటి ప్రముఖతను తెలియపరచుకున్నారు. ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత ఆటోమోటివ్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురుంచి తన అనుభవాలను విద్యార్థులకు తెలుపుతూఅభినందనలు తెలిపారు. అనంతరం డైనమిక్ కార్యక్రమాలను ప్రారంబించారు.
మూడవ రోజు బగ్గీల తయారీ విధానం,డిజైన్ సిస్టం ఎలా కంప్యూటర్ ద్వారా డిజైన్ చేయబడినదో కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్(సి ఏ ఈ) పరీక్షలు రెయిన్స్ట్రామ్ పరీక్షలు, వర్షపునీటిలో.నీటి గుంటలలో బగ్గీలు నడిపినప్పుడు సర్క్యూల్ట్ సిస్టం, బ్యాటరీ సిస్టం దెబ్బతినకుండా సురక్షితంగా వుందా లేదా నీటి లో కూడా నడపగల శక్తి ఈ బగ్గీలకు వుందా లేదా అని పరీక్షలు నిర్వహించబడినయని తెలిపారు.స్థిరత్వం వైపు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రపంచం పచ్చటి ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నందున స్థిరత్వం ఇ-బగ్గీలు (ఎలక్ట్రిక్ బగ్గీలు) పరస్పరం అనుసంధానించబడటానికి కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులచే వివిధ నూతన ఆధునిక పరిజ్ఞానంతో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి పరీక్షలు పెట్టటం ఇందులోని ముఖ్యా ఉద్దేశాలని అన్నారు. చివరి డైనమిక్ కార్యక్రమాలు మోటార్‌స్పోర్ట్ పోటీలలో ప్రధాన భాగమని
ఈ బాహా పోటీలో పాల్గొనే వారి విద్యార్థి బృందానికి అసాధారణమైన మార్గదర్శకత్వం ప్రదర్శించిన అధ్యాపక సలహాదారునికి ఈ బాహా సందర్భంలో ద్రోణాచార్య అవార్డును అందజేస్తారని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన తయారీ రంగంలో విద్యార్థులలో ఆవిష్కరణ, జట్టుకృషి శ్రేష్ఠతను పెంపొందించడంలో ఫ్యాకల్టీ సలహాదారుల యొక్క ముఖ్యమైన పాత్రను ఈ అవార్డు గుర్తిస్తుందని అన్నారు. ద్రోణాచార్య మూల్యాంకనం అధ్యాపక సలహాదారుల కోసం సమూహ కమిటీ సభ్యులచే చర్చలు ప్రారంభ అయినవని, ఇక్కడ ఏడు అధ్యాపకులను ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారని బాహా సే ఇండియా లను ప్రతిబింబించే మహిళల మినీ ఎండ్యూరెన్స్ రేస్ రోజున. వైవిధ్యం పట్ల నిబద్ధత. ఫీల్డ్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఈ ప్రత్యేక రేసు ప్రదర్శించబడిందని అన్నారు. జట్లలోని మహిళా డ్రైవర్లు తమ భద్రతా పరిశీలనను పూర్తి చేసివారి వాహనాలతో పోటీ పడుతున్నారని అన్నారు.రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ సెంటర్ ఇండియా స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమం ముగిసిందని. పోటీలలో విజేతగా నిలిచిన మహిళా డ్రైవర్ కి మహిళ ఉత్తమ డ్రైవర్ అవార్డు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో. బి.వి.ఆర్.ఐ.టి చైర్మన్. విష్ణు రాజు. ఆదిత్య విశ్వం. ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దూబే. సుభాష్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. కాంతారావు. బాపిరాజు. మల్లికార్జున్. సురేష్. వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు