డీ ఈశ్వర్ సిఐటియు ఆల్ హమాలీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి
జనం న్యూస్/జనవరి 12/కొల్లాపూర్
*శనివారం కొల్లాపూర్ పట్టణంలోహమాలీ కార్మికులసమావేశం నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి,నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని చేయాలని కేంద్ర ప్రభుత్వానికిడిమాండ్ చేశారు. కేంద్ర బిజెపిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను మార్చి సంపన్న వర్గాలకు అనుకూలంగా నాలుగు కొడ్లుగా చేసి కార్మికుల శ్రమను దోచి కార్పొరేట్లకు కట్టబెట్టిందని దుయ్యబట్టారు. హమాలీలురాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రెన్యువల్స్ రూపంలో లక్షల రూపాయలు చెల్లిస్తున్న సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. హమాలీ కార్మికులు హమాలీ కార్మికులకు అడ్డాలు గాని, విశ్రాంతి భవనాలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారికి సంక్షేమ పథకాలలో భాగంగా ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హమాలీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కారం చేయకుంటే హమాలీలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు. హమాలి సంఘం నాయకులు సత్యం, పకీర, బిచ్చన్న, రాముడు, సూరి, రామచందర్, శివ, శ్రీను, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు