జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు యుద్ధ ప్రాతిపదికన పైప్లైన్ ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలి. బి.శ్రీను నాయక్ చిలకలూరిపేట:కూటమి ప్రభుత్వం ఈనెల 28న జరిగే బడ్జెట్ సమావేశాల్లో వరికిపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు. శనివారం వినుకొండలోని గల సిపిఎం పార్టీ కార్యాలయంలో పిడియం నాయకులు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి చేయలేదన్నారు. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో నేల బోర్లు ఇంకిపోయాయి, సాగునీరు, తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యుద్ధ ప్రాతిపదికన పైప్లైన్ ద్వారాగా గ్రామీణ ప్రాంతాలకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే కార్యచరణ ప్రకటించి, దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ పిడియం, దళిత,గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.