జనం న్యూస్ 23.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం గుంనూర్ గ్రామానికి చెందిన ఆత్రం శేషు శుక్రవారం రాత్రి హస్నాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రొమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆత్రం శేషును శనివారం రాత్రి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.శేషు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.సుగుణక్క వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు విశాల్, సునిల్ జాదవ్ తదితరులు ఉన్నారు.