జనం న్యూస్. జనవరి 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)
నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసుల బృందం.
సుమారు రూ 60 కోట్ల విలువ గల ఆల్ప్రాజోలం, ఆల్ప్రాజోలేతర ఆస్తులు గుర్తించి నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. నిందితులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ.గత నెల డిసెంబర్ 31వ తేదీన గుమ్మడిదల పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు క్రైమ్ నెంబర్ 231/2024 సెక్షన్ 8(సి) ఆర్/డబ్ల్యూ 22 (సి) ఆఫ్ 29 ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద పరారీలో ఉన్న ప్రధాన నిందితుని కోసం దర్యాప్తు ప్రారంభించిన గుమ్మడిదల, సిసియస్ పోలీసులు ముత్తంగి గ్రామానికి చెందిన సుధీర్ గౌడ్ అనే వ్యక్తి ప్రధాన నేరస్తునిగా గుర్తించడం జరిగిందని నిన్న తేదీ 10-01-2025, సాయంత్రం 3.50 నిమిషాలకు A1 సుధీర్ గౌడ్ తన ఫోర్డ్ కార్ నెంబర్: TS 15 FD 2767 లో ముత్తంగి నుండి మెదక్ వెళ్తున్నట్లుగా గుర్తించి, అతని వాహనాన్ని మంబాపూర్ గెట్ వద్ద పట్టుకుని విచారించగా సుధీర్ గౌడ్ తన నేరాన్ని అంగీకరించి, ప్రస్తుతం అల్ప్రాజోలంను అమ్మటానికి మెదక్ వెళుతున్నట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
వివరాలలోనికి వెళితే: A1-గిర్మగౌని సుధీర్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్, వయసు: 47 సంవత్సరాలు, వృత్తి: రియల్ ఎస్టేట్ వ్యాపారం, గ్రామము: తన్మయి హోమ్స్ ముత్తంగి గ్రామం, పటాన్ చెర్వు, మండలం, స్వస్థలం: పిట్లంబేస్.మెదక్, జీవనోపాది కోసం బీరంగూడలో నివాసం ఉంటూ, డబ్బు సంపాదన మీద దూరాశతో 2014 సుధీర్ గౌడ్ అతని భార్య శ్రీవాణి అతని తమ్ముడు ప్రభుగౌడ్ తో కలిసి కమిషన్ కు కల్లులో కలిపే నిషేదిత అల్ప్రాజోలం మత్తు మందును అమ్మే పనిలో పడ్డాడు. 2017 లో కానుకుంటకు చెందిన విశాల్ గౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుండి అల్ప్రాజోలం తీసుకొని అమ్మేవారు. 2020 లో గుమ్మడిదలకు చెందిన సాయిగౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుండి అల్ప్రాజోలం కొని అమ్మేవాళ్లు. ఆ తరువాత విశాల్ గౌడ్ ముత్తంగికి చెందిన బీశ్వేశ్వర్ సింగ్ ను పరిచయం చేయగా, అప్పటి నుండి వీరందరూ కలిసి ఈ నిషేదిత అల్ప్రాజోలం వ్యాపారం చేస్తూ.. కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోక, అట్టి వ్యాపారంలో అధిక లాభాలను చూసి, సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకొన్నారు, బీశ్వేశ్వర్ సింగ్ కు అల్ప్రాజోలంను తయారు చేసే పద్దతి తెలుసని సొంతంగా అల్ప్రాజోలంను తయారు చేసి అధిక డబ్బులు సంపాదించవచ్చునని, 2023లో హైదరాబాద్ శివారులోని, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాచారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 39 లోఉన్న లక్ష్మణ్ గౌడ్, సాయి ప్రియ కెమికల్స్ కంపెనీని కొనాలని నిర్ణయించుకున్నారు, ముత్తంగికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాజేశ్వర్ శర్మను బీశ్వేశ్వర్ సింగ్ పరిచయం చేయగా ముగ్గురు కలసి 2023 మే నెలలో లక్ష్మణ్ గౌడ్ వద్ద ఉన్న కంపనీని కొనుగోలు చేసి, అట్టి కంపెనీలో నిషేదిత అల్ప్రాజోలంను తయారు చేసే మిషనరిని ఏర్పాటు చేసుకొన్నారు, సుధీర్ డ్రైవర్ అయినా బోడ శశి కుమార్ సహాయంతో అల్ప్రాజోలం తయారికి కావాల్సిన ముడిపదార్దాలను కొనుగోలు చేసి, ఒక బ్యాచ్ -50 కిలోల చొప్పున, నెలకు 1-2 బ్యాచ్ ల అల్ప్రాజోలంను తయారు చేసి కేజి 4 లక్షల చొప్పున హైద్రాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట కామారెడ్డి జిల్లాలలో అమ్మి అధిక డబ్బును సంపాదించేవారు.
నిందితుల వివరాలు:
ఏ-1). గిర్మగౌని సుధీర్ తండ్రి నారాయణ, వయస్సు: 47 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: వ్యాపారం, నివాసం ప్లాట్ నెం: 53, తన్మయి హోమ్స్, పటాన్చెరు మండలానికి చెందిన ముత్తంగి గ్రామం ఇంటి. నెం: 2-4-57/ఏ, పిట్లం బేస్, మెదక్ టౌన్ మరియు జిల్లా.
ఏ-2). బిశ్వేశ్వర్ సింగ్ తండ్రి గౌరహరి సింగ్, వయస్సు: 43 సంవత్సరాలు, కులం: రాజ్‌పుత్, వృత్తి: వ్యాపారం, నివాసం ప్లాట్ నెం. 171, రామరాజు నగర్, పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం. స్వస్థలం: సాలికుంట గ్రామం, జలుసర్ మండలం, బాలేశ్వర్ జిల్లా, ఒడ్డిసా. రాష్ట్ర.
ఏ-3). రాజేశ్వర శర్మ జోషి తండ్రి దివంగత సత్యనారణ శర్మ జోషి, వయస్సు: 41 సంవత్సరాలు, కులం: బ్రాహ్మణ, వృత్తకుల వృత్తి, నివాసం ఇంటి నెం: 2-7, పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం.
ఏ-4). గిర్మగౌని శ్రీవాణి. భర్త సుధీర్, వయస్సు: 38 సంవత్సరాలు, కులం: గౌడ్, వృత్తి: ఇంటి భార్య, నివాసం, ప్లాట్ నెం: 53, తన్మయి హోమ్స్, పటాన్చెరు మండలానికి చెందిన ముత్తంగి గ్రామం ఇంటి. నెం: 2-4-57/ఏ. , పిట్లం బేస్, మెదక్ టౌన్ మరియు జిల్లా.ఏ-5). బోడ శశి కుమార్ స/ఆ అంజయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మాల), ఓసీ: డ్రైవర్, ఇంటి స్థలం నెం: ఏA/11, న్యూ బహార్, సహారా ఎస్టేట్ కాలనీ, ఆటో నగర్, హైత్ నగర్, హైదరాబాద్ స్థానికుడు చింతపల్లి గ్రామం, నల్గొండ జిల్లా పెద్దవూర మండలం. (అరెస్టు చేయబడిన ఏ1 నుండి ఏ5 లను రిమాండ్ కు తరలించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు.ఏ1. ఏ5 నిందితుల వద్ద 740 గ్రాముల నిషేధిత ఆల్ప్రాజోలం, 3- కార్లు, 6 సెల్ ఫోన్ లు స్వాధీన పరుచుకున్నామని అన్నారు. వీరి వద్ద సుమారు 60 కోట్ల విలువ గల ఆస్థులు గుర్తించడం జరిగిందని తెలిపారు.ఏ-6). గిర్మగౌని ప్రభు గౌడ్ తండ్రి నారాయణ, నివాసం పిట్లం బేస్, మెదక్ పట్టణం మరియు జిల్లా. ఏ-7) వట్పల్లి సంగమేశ్వర్ గౌడ్ నివాసం మెదక్. ఏ-8) విశాల్ గౌడ్ నివాసం కనుకుంట గ్రామం, ఏ -9) సాయి గౌడ్ నివాసం గుమ్మడిదల. ఏ-10) అమీర్ నివాసం మెదక్. ఏ11) శ్రీకాంత్ నివాసం మేడ్చల్. ఏ-12) మంగ శ్రీనివాస్ గౌడ్ నివాసం మెదక్. ఏ-13) తొగిట రాజ శేఖర్ నివాసం మెదక్. ఏ-14) సుధాకర్ నివాసం కూచన్‌పల్లి (ఏ6 - ఏ14 ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.
ఏ-15) కలాలి అశోక్ గౌడ్ తండ్రి చంద్రయ్య, వయస్సు: 46 సంవత్సరాలు, కుల: గౌడ్, వృత్తి: కుల వృత్తి నివాసం ముడి మాణిక్యం గ్రామం, పుల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా.ఏ-16 లింగన్నగారి నారాయణ మూర్తి గౌడ్ స/ఓ లింగయ్య, వయస్సు: 50 సంవత్సరాలు, తారాగణం: గౌడ్, ప్రాంతం: కుల వృత్తి తరెల్మా గ్రామం, ఆంధోల్ మండలం, సంగారెడ్డి జిల్లాఏ-17 డాలరి సాయిలు. రాజు స/ఓ కిష్టయ్య, వయస్సు: 51 సంవత్సరాలు, తారాగణం : గౌడ్, ప్రాంతం: కుల వృత్తి, గదిపెద్దాపురం గ్రామం, అల్లాదుర్గం మండలం, మెదక్ జిల్లా.(ఏ-15 - ఏ17 లను 31/12/2024న అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగిందని తెలిపారు.జిల్లా ప్రజలకు విజ్ఞప్తి: ఆల్ప్రాజోలం కలిపిన కల్లు స్లో పాయిజన్ వంటిది, అనేక మంది యువకులు/విద్యార్థులు డ్రగ్స్/గంజాయి మాదకద్రవ్యాలకు అలవాటు పడి, వివిధ రకాల నేరాలు చేయడం ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుందని. ఈ డ్రగ్ మహమ్మారి మత్తులో అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, వారిని నమ్మిన అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. యువత/విద్యార్థులు డ్రగ్స్/గంజాయి బారిన పడవద్దని సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ, టీజీ, నాబ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ పరిసర ప్రాంతాలలో ఏదైనా అనుమానిత, రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లైతే వెంటనే జిల్లా పోలీసులకు ఎస్-నాబ్ నెంబర్ (8712656777) కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీవంతు పాత్ర ఉండాలని ఎస్పీ రూపేష్ జిల్లా ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, సిసియస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, జిన్నారం ఇన్స్పెక్టర్ నయీముద్దీన్, గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, సిసియస్ ఎస్ఐ శ్రీకాంత్. హత్నూర ఎస్సై కే శుభాష్. సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.