ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఫిబ్రవరి 22 : రాష్ట్ర మంతట ఉదయం 9:30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సబ్జెక్టు నిపుణులతో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా ఎస్ఎస్సి ఉత్తీర్ణత శాతం పెంచుటకు విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టులు ఎలా ప్రిపేర్ కావాలో సబ్జెక్ట్ నిపుణులు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జమాన్యాలలోని పాఠశాల విద్యార్థులు ఉదయం నుండి తమ పాఠశాలలోని ఐ ఎఫ్ పి ప్యానెల్ లో టీ ఎస్ ఎ టి ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగింది.