జనం న్యూస్ జనవరి 11 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఎల్ పురం మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందించిన గ్రామ సర్పంచ్ లోచల సుజాత ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు గ్రామాలలో చేస్తున్న సేవలు వర్ణనాతీతమని వారు సంతోషంగా ఉంటేనే గ్రామాలు పరిశుభ్రంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలియపరుస్తూ వారి సేవలను కొనియాడారు.