జనం న్యూస్ రిపోర్టర్,(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం MPDO కార్యలయంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ అదేశాల ప్రకారం నందలూరు మండల జనసేన నాయకులు MPDO రాధ కృష్ణన్ తో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు.ఈ భేటిలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన తరువాత గత 20,25 సంవత్సరాలుగా రొడ్లు లేక అవస్థలు పడ్డా రాష్ట ప్రజలతో పాటు నందలూరు ప్రజలు కూడ పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యకా గ్రామలకు మోక్షం వచ్చి రొడ్లు వచ్చాయి ప్రజలు సంతోషంగా వున్నారు కాని ఏ CC రోడ్డు దగ్గర కనిసం శిల ఫలకం ఏర్పాటు చెయ్యలేదు ఈ విషయంను MPDO రాధ కృష్ణన్ దృష్టికి తీసుక పోవడంతో ఖచ్చితంగా ప్రతి CC రోడ్డు దగ్గర శిల ఫలకం ఏర్పాటు చేస్తాను అని తెలియజేశారు.అలాగే MPDO కార్యలయంలో అధికారుల సమక్షంలో జరిగే ప్రతి కార్యక్రమాలకు NDA కూటమిలో అన్ని పార్టీల నాయకులకు పక్షపాత దొరణి లేకుండా సమాన అహ్వానం ఇవ్వలని తెలియజేయడం జరిగింది.ఈ భేటి అనంతరం MPDO అనంతరం జనసేన నాయకులు MPDO రాధకృష్ణని సన్మానించి సౌమ్యనాథ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు కొట్టే శ్రీహరి,హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర,నందలూరు జనసేన నాయకులు హోటల్ శివ,మస్తాన్ రాయల్,జగింటి రత్నం,డాల,ప్రతాప్,పవన్ జనసైనికులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.