ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి చిన్న మైల్ అంజిరెడ్డి.. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తన జీతం డబ్బులతో ప్రభుత్వ పాఠశాలల పునర్ధరణ.. బిజెపి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్.. జనం న్యూస్ 25 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ నియోజక వర్గాల ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపు కోసం ఎల్కతుర్తి మండల బిజెపి అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ ఆద్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది అనంతరం శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతు ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్న వ్యక్తి చిన్నమైల్ అంజిరెడ్డి ఎం ఎల్ సి గా గెలిచిన తర్వాత తన జీతం డబ్బులతో ప్రభుత్వ పాఠశాలల పునర్దరణ చేస్తానని అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఒత్తిడి లేకుంట ఫ్రీ హెల్ప్ లైన్స్ ను ప్రారంభిస్తానని అసలు తెలంగాణ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం అవుతుంది. అందువలన పట్టభద్రులు ఆలోచించి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపు కోసం మొదటి సిరియల్ నెంబరు పై(1) వేసి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మండలంలోని అన్ని గ్రామాల శక్తి కేంద్రం అధ్యక్షులు బూత్ అధ్యక్షులు ప్రతి గ్రామ ప్రభారీలు కార్యకర్తలు పాల్గొన్నారు