జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసినందున, కూటమినాయకులు..కార్యకర్తలు.. బూత్, క్టస్లర్, యూనిట్ ఇన్ ఛార్జ్ లు, సాధికారమిత్రలు పోలింగ్ రోజున ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మంగళవారం ఆయన పట్టణంలోని పలు ప్రైవేట్ బ్యాంకుల సిబ్బందిని, ప్రభుత్వ విభాగాల సిబ్బందిని అసిస్ట్ సంస్థ సభ్యులను కలిసి ఆలపాటికి మద్ధతు తెలపాలని అభ్యర్థించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారం.. రేపటి (గురువారం) పోలింగ్ సరళిపై నాయకులు, ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు, అందుబాటులో లేని వారితో ఫోన్లో మాట్లాడి పలుసూచనలు చేశారు. ఎన్నికల అధికారులతో మాట్లాడి పోలింగ్ ఏర్పాట్లగురించి అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు చేసిన ప్రచారం ఒక ఎత్తు అయితే, నేడు జరిగే పోలింగ్ ఒకెత్తని, ఇన్నిరోజుల పడిన కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే చివరిగంటల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరికీ శివరాత్రి ఒకరోజు అయితే మనకు ఈ సారి రెండురోజులు వచ్చిందనే విషయం గుర్తించాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా, ఎన్నికక విషయంలో నియోజకవర్గంలో ఎక్కడా చిన్న తప్పు కూడా జరగడానికి వీల్లేదని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కూటమి నాయకులు జయరామీ రెడ్డి, 3 పార్టీల మండల అధ్యక్షులు, టీడీపీ నాయకులు షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, నరసింహారావు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.