జనం న్యూస్/ నెక్కొండ /నేటి సమాజంలో మహిళలు అందంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు బ్యూటీ పార్లర్ స్థాపించి సరిపడా సంపాదిస్తున్నారని, అందుకే ఆసక్తిగల మహిళలకు బ్యూటీషియన్ లు గా తయారవ్వడానికై , రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ తెలంగాణ ఇనిస్ట్యూట్ మరియు ఎస్బిఐ, సంయుక్తంగా మహిళలకు ఉచితంగా బ్యూటీ పార్లర్ నందు మెలకువలు నేర్పుటకై 30 రోజులు శిక్షణ ఇస్తున్నదని సంస్థ ప్రతినిధి కిషోర్ తెలిపారు. ఆసక్తి గల వారు జనవరి 26లో దరఖాస్తు చేసుకోవాలని శిక్షణ పొందే వారికి ఉచిత హాస్టల్, భోజన సదుపాయం నిర్వాహకులు కల్పిస్తున్నదని ఆయన అన్నారు .దరఖాస్తుదారులు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు లోపు ఉండాలని వారికి రేషన్ కార్డు ,ఉపాధి హామీ జాబ్ కార్డు, తప్పనిసరి ఉండాలని వీరు డిఆర్డిఏ కాంప్లెక్స్ టిటిడిసి హసన్పర్తి లో దరఖాస్తు చేసుకోవాలని ఇంకా ఏమైనా వివరాలు కావలసి వస్తే సంస్థ ప్రతినిధులు కిషోర్ 970 40 56522, తో పాటు బషీర్ 9 8 4 9 3 0 7 8 7 3 నంబర్లను సంప్రదించాలని వారు తెలిపారు.