జనం న్యూస్ 27 ఫిబ్రవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండలంలోని ఓంకారం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆరు పండ్ల సైజు విభాగం ఎద్దుల బలపదర్శన పోటీలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేసీ కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి,మార్కుపేడ్ డైరెక్టర్ తాతి రెడ్డి తులసిరెడ్డి,నందిపాటి నరసింహ రెడ్డి,ఓంకారం పెర్టీలేజర్ తాతి రెడ్డి నాగేశ్వరరెడ్డి,తాతి రెడ్డి మనీష్ రెడ్డి ,,కంచర్ల సురేష్ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,శంకర్ రెడ్డి,పాల్గొని ఎద్దుల పోటీలు ప్రారంబించారు .ముందుగా ఎద్దుల యజమానులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో,మండల టీడీపి నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.