జనం న్యూస్ ఫిబ్రవరి 26 మండలం పెన్ పహాడ్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెన్ పహాడ్ మండల పరిధిలోని పలు గ్రామాలలో శివనామస్మరణలతో దేవాలయాలు మార్మోగాయి నారాయణ గూడెం లోని శ్రీ కాశీ విశ్వేశ్వర భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై హోమం ,కల్యాణం ప్రత్యేక పూజలు నిర్వహించారు.శివ నామస్మరణంతో నారాయణ గూడెం గ్రామం అంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. నాగులపాడు లోని మూసీ నదిలో బుధవారం తెల్లవారుజామున నుంచి భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించి నది ఒడ్డున కొలువై ఉన్నటువంటి యాదవుల కులదేవత గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివనామస్మరణంతో గ్రామ పరిధిలోని శ్రీ త్రికుటేశ్వర ఆలయంలో భక్తులు శివనామస్కరణాలతో భక్తిశ్రద్ధలతో శాస్త్రస్త్రంగా వెంకటరమణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ పోగుల జానయ్య గౌడ్ మాట్లాడుతూ ఉదయం దేవాలయం లో హోమం శివపార్వతుల కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా రెండు రోజులపాటు జరిగే క్రీడా పోటీలు సాంస్కృతి కార్యక్రమాలు ఊరేగింపు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రంజిత్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకిరామ్ రెడ్డి కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బైరు శైలేందర్ యాదవ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దొంగలు యుగేందర్ మాజీ ఎంపీపీ మండల జ్యోతి పిచ్చయ్య ఉత్సవ కమిటీ సభ్యులు పెద్దలు చిన్నలు తదితరులు పాల్గొన్నారు