జీవితంలో విజయం సాధించడానికి సార్వత్రిక శాంతి మరియు సామరస్యం కోసం మహారుద్ర యాగం
జనం న్యూస్ రిపోర్టర్(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పుర స్కరించుకొని శ్రీ శ్రీ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం గుండ్లూరు శివాలయంను సందర్శించారు. కుటుంబ సమేతంగా సర్వజన హితం కోసం.మహారుద్ర యాగం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ మెంబర్లు.ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.పూజల అనంతరం వేద పండితులు పరిమళ ప్రసాదాలను మేడా విజయ శేఖర్ రెడ్డి దంపతులకు అందచేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రుద్ర మహా యాగం అనేది సమస్త సృష్టికి విశ్వశక్తికి మూలమైన శివుని ఆరాధనలో చాలా ముఖ్యమైన రూపంలో ఆయన దివ్య రూపం అన్ని తెలిసిన మరియు తెలియని గెలాక్సీలు మరియు విశ్వాలను ఆవరించి విస్తరించి ఉంది అని. శివుడు సర్వశక్తిమంతుడు,సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి మరియు అన్నిటినీ వ్యాపించి ఉన్నాడు అని. ఆయన మృత్యువును జయించినవాడు మరియు అనంతమైన దయ, కరుణ మరియు ప్రేమ యొక్క స్వరూపుడు. మన ఉనికికి దైవత్వానికి రుణపడి ఉన్నాము మరియు ఆయన గురించి నిరంతరం ఆలోచించడం మరియు సమస్త మానవాళి మరియు సృష్టి యొక్క సంక్షేమం కోసం ఆయనను కృతజ్ఞతతో పూజించడం మన విధి అని రాజంపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గుండ్లూరు సర్పంచ్ మదన్ మోహన్ రెడ్డి. ఎల్లమ్మరాజు పల్లి సుబ్బారెడ్డి. శ్రీనివాసులు రెడ్డి.మండెం నాగరాజు.తదితరులు పాల్గొన్నారు.