మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తాహ
జనం న్యూస్,ఫిబ్రవరి 27,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి హనుమాన్ మందిర్ ఆవరణంలో స్థానిక శ్రీ రుక్మిణి పాండురంగ మందిరములో మహాశివరాత్రి ని పురస్కరించుకొని వైష్ణవ సాంప్రదాయ అఖండ హరినామ సప్తహామును శుక్రవారం రోజున ప్రారంభించారు.ఈ సందర్భంగా వైష్ణవ సాంప్రదాయ భక్తులు మాట్లాడుతూ శ్రీ సంత దేహు నివాసి పంచమ వేద లిఖితుడు తుకారం మహారాజ్ అని అన్నారు.తుకారం మహారాజ్ మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మాధవునిగా మారవచ్చని మారాలని పంచమ వేదము ద్వారా మానవాళికి హితోపదేశం చేశారని అన్నారు.తుకారం మహారాజ్ తాను స్వయంగా ఆచరించి భగవత్ నామస్మరణ చేసి మానవ దేహముతో వైకుంఠానికి వెళ్లారని అన్నారు.శ్రీ సంత్ తుకారాం మహారాజ్ ప్రేరేపణతో ప్రతి సంవత్సరము లాగానే నిరంతరము అఖండితంగా ప్రతి సంవత్సరం అఖండ హరినామ సప్తాహమును మాఘ మాసము అస్టిమి రోజున మొదలుకొని మాఘమాసము గురువారం ఘథా పూజ ఘనంగా నిర్వహించారు. అమావాస్య కాలా కీర్తనతో ముగిస్తుందని అన్నారు.మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిసరాల వైష్ణవ సాంప్రదాయిక భావిక భక్తులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.