కొత్తపల్లి. జమ్మికుంట రైల్వేస్టేషన్ లొ పుట్బోర్డ్ వంతెన నిర్మిoచాలి
జనం న్యూస్ // ఫిబ్రవరి // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రజా సమస్యలు పరిష్కారంలో బాగంగా పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ నియోజకవర్గ లోని కాసుబోజుల వెంకన్న జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మరియు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా,, ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ని మర్యాద పూర్వకంగా హైదరాబాద్లో తన నివాసంలో కలువడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొత్తపల్లి గ్రామం నుండి జమ్మికుంట రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళేటానికి ఫుట్ బోర్డు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.సత్వరమె సమస్యా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.గత ఎన్నో ఏళ్లుగా జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి కొత్తపల్లి గ్రామం,దర్మారం, రామన్న పల్లే, మరియు ఇతర గ్రామాలకు రైల్వే స్టేషన్ నుండి రైల్వే ట్రాక్ దాటి నడుచుకుంటూ వెళ్ళేవారు.అని
ఇప్పుడు రైల్వే ట్రాక్,, లైన్లు పెంచడం మరియు కొత్తపల్లి గ్రామ శివారులో గల రైల్వే కాంపౌండ్, వాల్ కు ఉన్న చిన్న చిన్న దారులను కూడా మూసి వేస్తున్నారన్నారు .రైల్యే గోడకు ఆనుకుని 9 ఫీట్ల డ్రైనేజీ నిర్మాణం కూడా చేస్తున్నారు.అని ఇందువలన కొత్తపల్లి మరియు ఇతర గ్రామాల నుండి నడక దారిన రైల్వే స్టేషన్ నుండి జమ్మికుంట పట్టణానికి పొయే వారు విద్యార్థులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, దినసరి కూలీలు, గుమాస్తాలు, పేషెంట్లు,దివ్యాంగులు వీరు చాలా ఇబ్బంది,పడుతున్నారన్నారు.సుమారుగా 20 వేల జనాభా కలిగిన కొత్తపల్లి గ్రామం నిత్యం ప్రతి దినము అన్నీ అవసరాలకు, జీవనోపాధికి జమ్మికుంట మీదనే ఆధారపడి ఉన్నారు.అని ఈ యొక్క జమ్మికుంట రైల్వే ట్రాక్ దాటడం వలన చాలా మంది రైలు ఢీకొని మరణించారన్నారు.మరి కొంత మంది దివ్యాంగులుగా మారినారు.అని గత 10 రోజుల క్రితం ఒక ముస్లిం అమ్మాయి రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మరణించినదన్నారు.ఇది ఇలా ఉండగా ప్రతి రోజు నిత్యం ఇతర గ్రామాల ప్రజలు కొత్తపల్లి గ్రామం నుండి జమ్మికుంట రైల్వే స్టేషన్ కు వేలాది మంది రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లే టానికి ప్రయాణికులు వస్తుంటారని తెలిపారు. ఈ విషయాలు ఈటెల రాజేందర్ కి పూర్తిగా వివరించి ఫుట్ బోర్డు వంతెన నిర్మాణానికి కృషి చేయాలని కోరడమైనదన్నారు.అదేవిదంగా కొత్తపల్లి గ్రామస్తులు అందరూ (పుట్బోర్డు ) కీ సంతకాలు చేసిన వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
ఈటెల రాజేందర్ ఈవిషయమై స్పందించి తప్పకుండా ఫుట్ బోర్డు నిర్మాణానికి కృషి చేస్తానని ప్రజల సమస్యల్ని తీర్చుతానని హామీ ఇచ్చారని,పేర్కొన్నారు.ఈకార్యక్రమం లొ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ . సలీం పాషా,ఉన్నారు.