జనం న్యూస్ 27 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్ణానికి చెందిన వై. శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి వెంకోజిపాలెం వద్ద మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. భయపడి ఆనంద్ పారిపోగా… శ్రీను వెంటపడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.