పదవి విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు ను సన్మానించిన జిల్లా అదనపు ఎస్పీ ఆర్.ప్రభాకర రావు
జనం న్యూస్ పీబ్రవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పి ఆర్.ప్రభాకర రావు హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు యొక్క పదవి విరమణ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పదవి విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు ని జిల్లా పోలీస్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వీడ్కోలు కార్యక్రమం లో అదనపు ఎస్పీ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ట్లాడుతూ..
హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు 1990 లో పోలీసు శాఖలో ఏ.ఆర్ పోలీసు కానిస్టేబుల్ గా నియామకమై, గడిచిన 35 సంవత్సరాల సర్వీస్ లో వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందారని అన్నారు. సర్వీస్ మొత్తంలో ఎలాంటి రిమార్క్ లేకుండా 2016 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారని అన్నారు. పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని వారి సేవలను కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని, మిగిలిన శేష జీవితం అతని కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి కరుణాకర్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, ఎం.టి.ఓ ఆర్.ఐ అంజన్న, డి.పీ.ఓ ఏవో శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సంఘం వైస్ ప్రెసిడెంట్ స్వామి, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.